వీరికి మాత్రం కఠిన శిక్షలు తప్పవు

by Naveena |   (  Updated:2025-03-04 15:31:00  IST  )

పని చేస్తున్న ప్రదేశాల్లో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు తప్పవని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,జడ్జి ఇందిర హెచ్చరించారు

వీరికి మాత్రం కఠిన శిక్షలు తప్పవు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పని చేస్తున్న ప్రదేశాల్లో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు తప్పవని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,జడ్జి ఇందిర హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన 'మహిళలు పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులు' పై నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని అన్నారు. ప్రతి కార్యాలయంలో 10 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ప్రతి పని ప్రదేశం ఒక అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. లైంగిక వేధింపుల అండర్ సెక్షన్ 354 ను ఇప్పుడు కొత్త చట్టం 74 బీఎన్ఎస్ గా మార్చబడిందని జడ్జి వివరించారు. మహిళలకు ఏమైనా సమస్యలు వేస్తే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ను సంప్రదించి సలహాలు,సూచనలు తీసుకోవచ్చని అన్నారు. 8న 'ఉమెన్స్ డే' సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలతో కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story