- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరంపై బయట చర్చలు కాదు.. అసెంబ్లీలో చర్చ జరగాలి దోషులను శిక్షించాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై కమిషన్ రిపోర్ట్ పై బయట చర్చలు కాదు అసెంబ్లీలో చర్చలు జరగాలని దోషులను శిక్షించాలని అసెంబ్లీలో జరిగే కమిషన్ రిపోర్ట్ చర్చలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొని వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

దిశ, జడ్చర్ల : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై కమిషన్ రిపోర్ట్ పై బయట చర్చలు కాదు అసెంబ్లీలో చర్చలు జరగాలని దోషులను శిక్షించాలని అసెంబ్లీలో జరిగే కమిషన్ రిపోర్ట్ చర్చలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొని వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభల్లో చాడ వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ. కాళేశ్వరం పై గోష్ కమిషన్ రిపోర్ట్ పై మంత్రివర్గం సమావేశమై చర్చించి ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు.
అసెంబ్లీలో కాలేశ్వరం తీర్మానం చర్చల్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తప్పనిసరిగా పాల్గొని జరిగిన విషయాన్ని వాస్తవాలను ప్రజలకు తెలపాలని అన్న మంత్రివర్గం ఆమోదం లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయిందా అని, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయని బయట చర్చలు కాదు, అసెంబ్లీలో చర్చలు చేస్తే ప్రజలు ఎవరు ఏంటి అనేది గుర్తిస్తారని అన్నారు. కాళేశ్వరం ముమ్మాటికి ఎత్తిపోతల పథకమే కానీ ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి నాణ్యత ప్రమాణాలు లేకుండా కట్టారని బ్యాంకులో 60,70 వేల కోట్లు అప్పు చేశారని ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై 94 వేల కోట్ల ఖర్చు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని అసెంబ్లీలో చర్చ జరగాలని దోషులకు శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ పై మరో మరో అధ్యయనం జరగాలని ప్రాజెక్ట్ చాలా నత్త నడకన జరుగుతుందని బ్యాక్ వాటర్ తో ఇబ్బంది అవుతుందని అప్పుడే సీపీఐ చెప్పిందని నికర జలాలను తీసుకుంటూ శ్రీశైలం బ్యాక్ వాటర్ ను వాడుకుంటూ కృష్ణ జిల్లాలను వాడుకోవాలని అప్పుడే చెప్పామని ఇప్పటికీ కొత్త ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని అన్నారు.
పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు జిల్లాను కరువు నివారణ చేసి సశ్యశ్యామలం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేస్తుంది ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై నాన్చకుండా త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సినీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తున్నామని మొండిగా వ్యవహరిస్తున్న నిర్మాతల మండలి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినీ కార్మికుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.






