- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టుదల ఉంటే సాధించనిదంటూ ఏమి లేదు : కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో చదివితే సాధించినది ఏమీ లేదని జీవితంలో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని కలెక్టర్ సీ.హెచ్ ప్రియాంక అన్నారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో చదివితే సాధించినది ఏమీ లేదని జీవితంలో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని కలెక్టర్ సీ.హెచ్ ప్రియాంక అన్నారు. సోమవారం దామరగిద్ద మండల పరిధిలోని విట్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించడంతో ప్రశంస పత్రం నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృషి పట్టుదల తో ఉన్నత విద్య అభ్యసించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని బి శైలజ, అక్షిత లను అభినందించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధనలు చేపడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు ప్రధానోపాధ్యాయులు జి. నాగిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు ఆశన్న, సత్యనారాయణ రెడ్డి జగదీష్, వెంకటేశ్వర్లు, పిడి వేణుగోపాల్ పాల్గొన్నారు.






