జడ్చర్ల లో గన్ కలకలం.. అస‌లు విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : జడ్చర్లలో యువకుడి వద్ద గన్ ఉండడం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం స్థానిక పోలీసులకు కాలనీ వాసులు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. జ

జడ్చర్ల లో గన్ కలకలం.. అస‌లు విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!
X

దిశ, జడ్చర్ల : జడ్చర్లలో యువకుడి వద్ద గన్ ఉండడం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం స్థానిక పోలీసులకు కాలనీ వాసులు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని జౌకి నగర్ కు చెందిన వకీల్ అనే యువకుడు గన్ చేతిలో పట్టుకొని కాలనీలో తిరుగుతున్నారని సమాచారం అందడంతో వెంటనే జౌకి నగర్ కు చేరుకుని వకీల్ అనే యువకుడిని అతని వద్ద ఉన్న ఎయిర్ రైఫిల్ గన్ ను స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించాగా అది ఎయిర్ రైఫిల్ గన్ అని ఆగంతో పక్షులు చెట్లపై వాలకుండ బెదిరించడానికి గాలిలో కాల్పులు జరపడానికి ఉపయోగిస్తారని తెలిపారు. ఈ గన్ ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపారు. యువకుడు ఆ గన్ చేతిలో పట్టుకొని కాలనీలో తిరగడం కార్లో పెట్టుకోండి తిరగడం సరైనది కాదని ఇంకోసారి ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేలా వ్యవహరించకూడదని హెచ్చరించి యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు. యువకుడి వద్ద ఉన్న గన్ ఎయిర్ రైఫిల్ గన్ అని తేలడంతో పట్టణ ప్రజలు కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story