- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య
తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గురుకుంట గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, నవాబుపేట : తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గురుకుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుంట గ్రామానికి చెందిన బోవళ్ల గణేష్ (21) శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఉరేసుకున్నాడు. గణేష్ పదోతరగతి వరకు చదువుకొని ఆటో డ్రైవర్ గా జీవనోపాధి పొందుతున్నాడు. ఇటీవల జరిగిన హోలీ పండుగ రోజు తన స్నేహితులతో గొడవ పడ్డాడు. వారితో గొడవ ఎందుకు పడ్డావని తండ్రి మందలించాడు. శుక్రవారం ఉదయం తన ఆటో తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా కూడా గణేష్ ఇంటికి రాకపోవడంతో తండ్రి ఆయనకు ఫోన్ చేయగా.. తాను నవాబుపేటలో ఉన్నానని.. రాత్రికి ఇంటికి వస్తానని చెప్పి శనివారం ఉదయం వరకు కూడా ఇంటికి చేరుకోలేదు. దీంతో శనివారం ఉదయం 10.30 తరువాత మృతుడి చిన్నాన్న బోవళ్ల రాజశేఖర్ తన అన్న అయిన వీరన్నకు కాల్ చేసి గణేష్ తన వ్యవసాయ పొలంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నట్టు తెలిపాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని చూసిన కుటుంబ సభ్యులకు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు కనిపించాడు. ఈ విషయం పై తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు.






