- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > Accident : పాముకాటుకు గురైన మహిళ... ఆస్పత్రికి వెళ్తుండగా యాక్సిడెంట్

X
దిశ, నారాయణపేట క్రైమ్/ఊట్కూర్ : ఒకరిని కాపాడబోతుంటే.. మన ప్రాణాలే పోవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. పాము కాటుకు గురైన మహిళను బైకుపై జిల్లా హాస్పిటల్ కు తీసుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా సమీపంలోని సింగారం గ్రామ స్టేజి దగ్గరలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్కూర్ మండలానికి చెందిన యర్గట్ పల్లి గ్రామానికి చెందిన సుజాత రెండు మూడు రోజుల క్రితం పాము కాటుకు గురైంది. దీంతో హాస్పిటల్ కు చికిత్సకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం మరోసారి చికిత్స కోసం గ్రామానికే చెందిన అభి అనే యువకుడు బైక్ పై తీసుకు వెళ్తుండగా.. సింగారం గ్రామ స్టేజ్ దగ్గరలో ఉన్న దత్త బృందావన్ కాలేజ్ సమీపంలో రోడ్డుకు అడ్డు వచ్చిన ఎద్దులను తప్పించబోయాడు. కానీ ఇంతలో బైకు అదుపు తప్పడంతో ప్రమాద వషాత్తు యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయాలతో ఉన్న సుజాతను ఆస్పత్రికి పంపించినట్లు స్థానికులు తెలిపారు. నారాయణపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Next Story






