- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడి కట్టనివ్వనందుకు రోడ్డెక్కిన గ్రామస్తులు
నిర్వాసిత గ్రామం పునః నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గ్రామస్తులందరూ గుడి కట్టడానికి వెళ్తే పోలీసులు అభ్యంతరం చెప్పడంతో గార్లపల్లి గ్రామస్తులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

దిశ, మక్తల్ : నిర్వాసిత గ్రామం పునః నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గ్రామస్తులందరూ గుడి కట్టడానికి వెళ్తే పోలీసులు అభ్యంతరం చెప్పడంతో గార్లపల్లి గ్రామస్తులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమస్య పరిష్కారం కోసం తహశీల్దార్ ను కలిస్తే..సరిపోతుందని ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి చెప్పడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద గార్లపల్లి గ్రామస్తులు బైఠాయించడంతో రెండు రోజుల్లో సర్వే చేసి హద్దులు నిర్వహిస్తామిన తహశీల్దార్ సతీష్ కుమార్ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. మక్తల్ మండలంలో సంగంబండ రిజర్వాయర్ లో గార్లపల్లి గ్రామం ముంపునకు గురైంది. పునః నిర్మాణం కోసం ప్రభుత్వం 169, 170 సర్వే నెంబర్లలో 24 ఎకరాల 14 గుంల భూమిని ఆర్ఆర్ సెంటర్ కి కేటాయించింది.
అందులో ఇళ్ల నిర్మాణంతో పాటు బడి, గుడి, పబ్లిక్ పర్పస్ కి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలున్నాయి. అయితే తమ గ్రామ దేవత లక్ష్మీదేవి దేవాలయ నిర్మాణం చేసుకోవాలని ఇటీవల భూమి పూజ చేసి, నిర్మాణ నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్వాసిత గ్రామ సర్వే నెంబర్ కి పక్క పొలం వ్యక్తి తమ పొలాన్ని ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామస్తులను బెదిరించడం.. రాజకీయ జోక్యం తోడైందని గ్రామస్తులు తహశీల్దార్ కి విన్నవించారు. రెండు రోజుల్లో సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని.. అప్పటి వరకు ఇరు వర్గాల వారు గొడవ పడకుండా ఉండాలని సూచించారు తహశీల్దార్. మరోవైపు గార్లపల్లి గ్రామం ప్రస్తుతం మక్తల్ మున్సిపాలిటీలో విలీనం కావడం గమనార్హం.






