- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసికందును హత్య చేసిన అగ్రకుల దురహంకారులను కఠినంగా శిక్షించాలి
మండల కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లో జరిగిన రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కాలుతో తన్ని హత్య చేసిన అగ్రకులస్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సోమవారం నిరసన తెలిపారు.

దిశ, అడ్డాకుల : మండల కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లో జరిగిన రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కాలుతో తన్ని హత్య చేసిన అగ్రకులస్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సోమవారం నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన గ్రామ అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు, హత్యా నేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో తక్షణమే రిమాండ్ చేయాలని కెవిపిఎస్ అడ్డాకుల మండల కార్యదర్శి టి ప్రసాద్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యపాత్రను ఖండిస్తూ అడ్డాకుల మండల కేంద్రంలో రాస్తారోకో చేస్తూ పోలీసుల నిర్లక్ష్యం నశించాలని అగ్రకుల పెత్తందారులందర్నీ తక్షణమే అరెస్ట్ చేయాలని బాధితకుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు బాలరాజు, కెపిఎస్ నాయకులు రామాంజనేయులు,రాజేష్, రమేష్, రాజు, చిన్న నరసింహ్మ పాల్గొన్నారు.






