గ‌డ్డి ట్రాక్ట‌ర్ ద‌గ్దం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : విద్యుత్ తీగ‌లు త‌గిలి గ‌డ్డి ట్రాక్ట‌ర్ ద‌గ్ధ‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని ఆకునోని ప‌ల్లి గ్రామంలో

గ‌డ్డి ట్రాక్ట‌ర్ ద‌గ్దం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం
X

దిశ‌, పాన్ గ‌ల్ : విద్యుత్ తీగ‌లు త‌గిలి గ‌డ్డి ట్రాక్ట‌ర్ ద‌గ్ధ‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని ఆకునోని ప‌ల్లి గ్రామంలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆకునోనిప‌ల్లి గ్రామానికి చెందిన రైతు రాములు వ్యవసాయ పొలం నుంచి వరి గడ్డిని తరలిస్తుండగా.. ఊరి చివరలో విద్యుత్ వైర్లు తగలడంతో నిప్పు రవ్వలు వ‌చ్చి పశుగ్రాసం దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ట్రాలీ నుంచి ఇంజన్ తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో పశుగ్రాసంతో పాటు ట్రాలీ ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రాక్టర్ యజమాని దాదాపు ప్రమాదంలో లక్షా 50 వేల రూపాయల వ‌ర‌కు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు.

Next Story