- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > చెడు అలవాట్లు మానుకోవాలన్నందుకు.. తండ్రిని నరికి చంపిన కొడుకు..!

X
దిశ నాగర్ కర్నూల్/తెల్కపల్లి : తెలకపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు అలవాటు పడొద్దని మందలించిన తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడు. మండలంలోని గట్టునెల్లికుదురు గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి సుల్తాన్(50) ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కుమారుడు మల్లేష్ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆవారాగా తిరుగుతుండడంతో అతనిని మందలించాడు. దీంతో నాకే చెప్తావా అంటూ కోపోద్రికుడైన మల్లేశ్ తండ్రి ఇంట్లో నిద్రిస్తున్నది చూసి అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మల్లేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






