సాయం పొందిన వారి దృష్టిలో దైవంగా నిలిపేది సేవ మాత్రమే : పాల‌మూరు యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ ఎన్ శ్రీనివాస్

by Ratna Kumari |

ఎన్‌ఎ స్‌ఎస్‌ క్యాంపు ద్వారా క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన ఏర్పడుతుందని పాల‌మూరు యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ జి.ఎన్. శ్రీనివాస్ పేర్కొన్నారు.

సాయం పొందిన వారి దృష్టిలో దైవంగా నిలిపేది సేవ మాత్రమే : పాల‌మూరు యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ ఎన్ శ్రీనివాస్
X

దిశ, హన్వాడ : ఎన్‌ఎ స్‌ఎస్‌ క్యాంపు ద్వారా క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన ఏర్పడుతుందని పాల‌మూరు యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ జి.ఎన్. శ్రీనివాస్ పేర్కొన్నారు. హన్వాడ మండలం వేపూరు గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం ఎం వి ఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్.ఎస్.ఎస్ 1&2 యూనిట్లు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నలుగురికి మనల్ని ఆదర్శంగా చూపించేది సాయం పొందిన వారి దృష్టిలో దైవంగా నిలిపేది సేవ మాత్రమేనని, యువత ఇంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమ న్నారు. ఈ క్యాంపు లో మహబూబ్ న‌గ‌ర్ ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి పలు విభాగాలకు చెందిన 22 మంది డాక్టర్లు, పలు చెకింగ్ మిషన్లతో ఈ శిబిరం నిర్వహణలో పాల్గొన్నారు. 500 మందికి పైగా గ్రామస్థులు వైద్య సహాయం పొందారు. ఈ సందర్బంగా పీయూ వీసీ జి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్ర మాలు చేపట్టడంతో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలు అభినంద నీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె ప్రవీణ, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఎంవీఎస్ కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ రవీందర్ రావు, కృష్ణమూర్తి, కళాశాల అధ్యాపక బృందము, ఎన్ఎస్ఎస్ సీనియర్ వాలంటీర్స్ రాఘవ, రాజు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు సుభాషిని, డాక్టర్ వి స్వరూప, వేపూర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు మదన్మోహన్ యాదవ్, గోపాల్ నాయక్, మరియు సర్పంచ్ చెన్నయ్య, ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్స్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

Next Story