- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. దాని వెనుక మిని ట్రావెల్స్ ఢీ..!
దిశ, మానవపాడు : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి ఒకదాని వెనుక మరొకటి వరుసగా మూడు వాహనాలు ఢీ కొన్నాయి.

దిశ, మానవపాడు : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి ఒకదాని వెనుక మరొకటి వరుసగా మూడు వాహనాలు ఢీ కొన్నాయి. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారును బోరవెల్లి స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై వెనుకనే గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఆ బస్సు వెనుకనే మరో మినీ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు 20 మీటర్ల దూరం వరకు ఎగిరి బోల్తా పడింది. కారులో ఉన్న యోగేష్ స్వల్పంగా గాయపడీ సురక్షితంగా బయటపడ్డాడు. ఆర్టీసీ బస్సు గద్వాల నుంచి 50 మందికి పైగా ప్రయాణికులతో కర్నూల్ వైపు వెళ్తోంది. ట్రావెల్ బస్సు కర్నూల్ నుంచి జోగులాంబ ఆలయానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కేకలు వేయడం... ఏం జరిగిందో అని భయభ్రాంతులకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






