కొల్లాపూర్ రైల్వే లైన్ తెచ్చే బాధ్య‌త మంత్రి, ఎంపీల‌దే

by Ratna Kumari |

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జడ్చర్ల - కొల్లాపూర్ - నంద్యాల రైల్వే లైన్‌ను తక్షణం సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎంపీ మల్లు రవిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

కొల్లాపూర్ రైల్వే లైన్ తెచ్చే బాధ్య‌త మంత్రి, ఎంపీల‌దే
X

దిశ, కొల్లాపూర్ : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జడ్చర్ల - కొల్లాపూర్ - నంద్యాల రైల్వే లైన్‌ను తక్షణం సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎంపీ మల్లు రవిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కొల్లాపూర్ గర్జన మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి. ఫయా జ్ అధ్యక్షత జరిగిన ధర్నాలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ, కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఈ రైల్వే లైన్ కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ముఖ్యంగా రాజ్యసభలో ప్రస్తావించేందుకు సీపీఐ ఎంపీలతో కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండే పార్టీ సీపీఐ అని పేర్కొంటూ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్టీసీ డిపో, కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ వంటి అనేక ప్రజా ఉద్యమాలను విజయవంతంగా నడిపిన చరిత్ర సీపీఐకి ఉందని ఆయన గుర్తుచేశారు. రైల్వే లైన్ సాధన కోసం కూడా ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై పోరాడాలని పల్ల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ మాట్లాడుతూ, మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో రాష్ట్ర భాగస్వామ్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మల్లు రవి ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి, కొల్లాపూర్ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి, నరసింహ, పెబ్బేటి విజయుడు, ఆర్. ఇందిర కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పెద్దకొత్తపల్లి మండల కార్యదర్శి బొల్లెద్దుల శ్రీనివాసులు, కోడేరు మండల పార్టీ కార్యదర్శి తప్పేట కిరణ్ కుమార్, కొల్లాపూర్ పట్టణ కార్యదర్శి ఎండి యూసుఫ్, సహాయ కార్యదర్శి రమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు, జి కురుమయ్య, డాక్టర్ సి హె శ్రీనివాసులు, పి పర్శరాములు, నాయకులు లక్ష్మీనారాయణ,దేవ సహాయం, నిరంజన్ నాయుడు, కృష్ణ ,ఇటికల కురుమయ్య, సంఘం కృష్ణ ,రాము, రాధాకృష్ణ, జి వెంకటస్వామి, రామకృష్ణ, బి గోపాల్, మండల కృష్ణ, బండి వెంకటమ్మ, కాటం బాలస్వామి, దండి కురుమయ్య, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పర్వతాలు, నరసింహ, సుదర్శన్ గౌడ్ చందు, మధు, కవిత నరసింహ పాల్గొన్నారు.

Next Story