- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
మండలంలో బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకొని మైనర్ బాలికను రక్షించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

దిశ, వీపనగండ్ల : మండలంలో బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకొని మైనర్ బాలికను రక్షించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. బొల్లారం గ్రామానికి చెందిన వంక రాధ రామకృష్ణ కుమార్తె అయిన 12 ఏళ్ల మైనర్ బాలికకు తుంకుంట గ్రామానికి చెందిన మండల సురేష్‌తో రహస్యంగా వివాహం జరిపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతుండగా సమాచారం అందుకున్న వీపనగండ్ల ఎస్సై వెంటనే అక్కడికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం బాలికతో పాటు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు మరియు సంబంధిత వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బాలిక మైనర్ కావడంతో ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో భద్రతకు అప్పగించారు. బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, చట్ట విరుద్ధంగా మైనర్లకు వివాహాలు జరిపితే తల్లిదండ్రులు మరియు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.






