- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోటార్ వెహికిల్ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
దిశ, ఉండవెల్లి : బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం- 2020 ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్

దిశ, ఉండవెల్లి : బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం- 2020 ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయు అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తా లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా యూనియన్ రెండవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టం-2020 వల్ల ప్రభుత్వం చెప్పిన్నట్లు రోడ్డు ప్రమాదాలు తగ్గలేదని, ఇంకా పెరిగాయని అన్నారు. వాహనాల రకాలకు అనుగుణంగా ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేయకపోవడం, రహదారులను విస్తరంచకుండా, రోడ్ల నాణ్యత పెంచకుండా, కేవలం పెట్టుబడి దారులు, బహుళ జాతుల కంపెనీల జేబులు నింపుకోవడానికి, మోటార్ వెహికిల్ చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. రవాణా రంగం మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రజలను దోచుకునేందుకు ఈ చట్టం తెచ్చారని విమర్శించారు.
డ్రైవర్ మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరవాత పరిహారాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికుల తరహాలో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులు సంఘాటితంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం 18 మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ. వెంకటస్వామి, నరసింహ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, చేతి వృత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్ మద్దిలేటి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపల్లె దేవదాసు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఈదన్న, ప్రముఖ న్యాయవాది లక్ష్మణ్ పాల్గొన్నారు.






