- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కుమారుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
అనారోగ్యానికి గురై కోలుకుంటున్న జడ్చర్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వి.కృష్ణ కుమారుడు చిద్విలాస్ రాఘవను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.

దిశ, జడ్చర్ల : అనారోగ్యానికి గురై కోలుకుంటున్న జడ్చర్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వి.కృష్ణ కుమారుడు చిద్విలాస్ రాఘవను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. పట్టణంలోని కృష్ణ నివాసానికి చేరుకున్న ఆయన చిద్విలాస్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన సూచించారు. ఇపుడిపుడే కోలుకుంటున్నందున కొన్ని నెలల పాటు మరింత జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యంగా ఎదగాలని, భవిష్యత్తులో మంచి ఉన్నత విద్యావంతుడు కావాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణ సతీమణి శ్రీదేవికి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.రవిశంకర్, అశోక్ యాదవ్, ఎస్సీసెల్ నాయకుడు యాదయ్య, వంశిచారి, దృవబాదిమి, కుమ్మరి రాజు, చైతన్య చౌహన్ అనీల్ కుమారెడ్డిలు ఉన్నారు.
ఇప్ప టీ తాగిన ఎమ్మెల్యే
పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కృష్ణ గృహాంలో ఇప్ప టీ తాగారు. ఇప్పపూలు, గిరిజనుల సంక్షేమం కోసం అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఇప్ప పూలతోచేసిన టీ తాగి ఆరోగ్య ప్రయోజనాలున్న ఇప్ప టీని అందరు అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.






