- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనానికి వేదిక కాబోతున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్
జడ్చర్ల రాజకీయాలలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సంచలనానికి వేదిక కాబోతున్నది.

దిశ, జడ్చర్ల /నవాబుపేట : జడ్చర్ల రాజకీయాలలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సంచలనానికి వేదిక కాబోతున్నది. టీపీసీసీ కోఆర్డినేటర్ ధారా భాస్కర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన సోదరుడు దుష్యంత్ రెడ్డిలపై దారా భాస్కర్ ఆరోపణలు చేస్తున్నారు. పలు ఆరోపణల నేపథ్యంలో భాస్కర్‌పై నవాబుపేట పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే క్యాంపు కార్యాలయాన్నే ఆయన ప్రెస్ మీట్ నిర్వహణకు వేదికగా ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ప్రెస్ మీట్ నిర్వహణకు అవకాశం లభిస్తుందా? లేక ఉద్రిక్తతలు చెలరేగుతాయా? అన్నది రేపటివరకు వేచి చూడాల్సిందే.
గతంలో ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి అదే కార్యాలయంలో ప్రెస్ మీట్ లు నిర్వహించడంతో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రెస్ మీట్ లు,కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు, నియోజకవర్గ పౌరుడిగా తాను ఎందుకు అందులో నిర్వహించుకోకూడదని ధారా భాస్కర్ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనకు ప్రెస్ మీట్ నిర్వహించుకునే అన్ని అర్హతలు ఉన్నాయని, ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మాణంలో నియోజకవర్గ పౌరుడిగా తాను చెల్లించిన పన్ను కూడా ఉన్నదని ధారాభాస్కర్ పేర్కొంటున్నారు. ఆయన వాదన సహేతుకమే అయినా కూడా, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించడం ఎంతవరకు సాధ్యమవుతుందో అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఆ కార్యాలయం ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే వాడుకోవడానికి నిర్మించిందని, అందువల్ల ఆయన అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించడం దారా భాస్కర్ కు సాధ్యపడకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది.






