- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూగుల్ మాటవిని నదిలోకి వెళ్లిన లారీ..!
దిశ, అమరచింత : గూగుల్ మాట విని ఓ లారీ డ్రైవర్ లారీని నదిలోకి తీసుకు వెళ్లిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మంగళవారం

దిశ, అమరచింత : గూగుల్ మాట విని ఓ లారీ డ్రైవర్ లారీని నదిలోకి తీసుకు వెళ్లిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని బేతం చర్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ పట్టణానికి బండల లోడ్ ను తీసుకు వస్తున్న లారీ డ్రైవర్ భాషా కు, చేదు అనుభవం ఎదురైంది.కొత్తకోట నేషనల్ హైవే 44 మీదుగా ఆత్మకూర్ నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ వేసుకుని డ్రైవింగ్ చేస్తూ, ఆత్మకూర్ చౌరస్తా చేరుకున్నాడు లారీ డ్రైవర్. అటు నుంచి కుడి వైపు వెళ్లకుండా ఎదురుగా ఉన్న దారిలో మూడు కిలోమీటర్ల మేర ప్రయాణం కొనసాగించాడు.మక్తల్ వెళ్లే రూటు ఎటువైపో తెలుసుకుందామంటే ఆ సమయంలో ఎవరు కనిపించక పోవడంతో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్ చేసినట్లు భాషా తెలిపారు.ఆ గూగుల్ మ్యాప్ దారి కాస్త లోయర్ జూరాల నది వైపు చూపించడంతో, తెల్లవారుజామున నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ నది లోకి లారీని తీసుకెళ్లాడు.నది దగ్గరలో నీళ్లు కనిపించడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడి మేల్కొన్న డ్రైవర్, వెంటనే లారీ బ్రేక్ లు వేశాడు.దింతో తృట్టిలో ప్రమాదం తప్పింది.కొంత మేర నది లోతుల్లోకి వెళ్లిన లారీని అన్లోడ్ చేసి వెన్నకి తీసేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు.






