ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట

by Ratna Kumari |

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకున్న అమానవీయ ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి దేవి తీవ్రంగా ఖండించారు. మంగళవారం బీజేపీ నాయకులతో కలిసి ఆమె ఆసుపత్రిని సందర్శించారు.

ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకున్న అమానవీయ ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి దేవి తీవ్రంగా ఖండించారు. మంగళవారం బీజేపీ నాయకులతో కలిసి ఆమె ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా అభివర్ణించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల లోపం, భద్రతా చర్యల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటన చోటుచేసుకుందని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా మారిందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించాల్సిన ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శించడం శోచనీయమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న జిల్లాలోనే ఈ ఘటన జరగడం మరింత బాధాకరమని ఆమె అన్నారు. జిల్లాలో ఆసుపత్రుల నిర్వహణపై సమగ్ర సమీక్ష చేసి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆసుపత్రిలో భద్రతా చర్యలను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బాల త్రిపుర సుందరి దేవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story