కొల్లాపూర్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పై హై కోర్టు తీవ్ర ఆగ్రహం

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ ఎస్సై, ఇద్ద‌రూ కానిస్టేబుళ్ల పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెప్టెంబ‌ర్ 17న కొల్లాపూర్ మండ‌లం మొల‌చింత‌ప‌ల్లి గ్రామానికి చెందిన చిరుముని బాల‌రాజు

కొల్లాపూర్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పై హై కోర్టు తీవ్ర ఆగ్రహం
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ ఎస్సై, ఇద్ద‌రూ కానిస్టేబుళ్ల పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెప్టెంబ‌ర్ 17న కొల్లాపూర్ మండ‌లం మొల‌చింత‌ప‌ల్లి గ్రామానికి చెందిన చిరుముని బాల‌రాజు యాద‌వ్ (32) అనే వ్య‌క్తి ఫిర్యాదు చేసేందుకు కొల్లాపూర్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో స్టేష‌న్ లో ఉన్న స్టేష‌న్ హౌస్ అధికారి హృషికేశ్, మ‌రో ఇద్ద‌రూ కానిస్టేబుల్స్ మాన‌వ‌త్వం మ‌రిచి ఫిర్యాదు ఇవ్వ‌డానికి వెళ్లిన త‌న‌ను అక్ర‌మంగా నిర్భందించి థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి తోలు బెల్ట్, బూట్ల‌తో త‌న్న‌డం, లాఠీల‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్టు దాడి చేసి హ‌త్యాయ‌త్నం చేశారు. న్యాయం చేయాల‌ని కోరుతూ నాగ‌ర్ క‌ర్నూల్ ఎస్పీ, తెలంగాణ డీజీపీ, తెలంగాణ హోమ్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీఇ బాధితుడు చిరుముని బాల‌రాజు ఫిర్యాదు చేశాడు. అయిన‌ప్ప‌టికీ వారు స్పందించ‌క‌పోవ‌డంతో బాధితుడు త‌న ప్రాథ‌మిక హ‌క్కుల‌కు తీవ్ర‌మైన భంగం క‌ల‌గ‌డంతో న్యాయం చేయాల‌ని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. పిటిష‌న్ నెంబ‌ర్ 31256/2025 పై దాఖ‌లు చేశాడు. ఈ ఫిర్యాదు పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై హృషికేశ్ ఇద్దరు కానిస్టేబుళ్ల పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోపు (గత నెల 17 వ తేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ భద్రపరిచి పూర్తి విచారణ జరిపి రెండు వారాల్లో హై కోర్టుకు సీసీ ఫుటేజ్ తో పాటు విచారణ నివేదిక సమర్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ని హై కోర్టు ఆదేశించిందని బాధితుడు బాలరాజు యాదవ్ తెలిపారు. బాధితుడు చిరుముని బాల‌రాజు యాద‌వ్ త‌ర‌పున హైకోర్టులో న్యాయ‌వాదులు క‌ర్నాటి వెంక‌ట్ రెడ్డి, మ‌హేష్ మామిండ్ల వాన‌ద‌ల‌ను వినిపించారు.

Next Story