- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కాగా నిర్వహించాలి
ధాన్యం నిల్వ వ్యవస్థను పక్కాగా నిర్వహించి, ధాన్యం నాణ్యతతో ఉండేలా పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్

దిశ, ఇటిక్యాల : ధాన్యం నిల్వ వ్యవస్థను పక్కాగా నిర్వహించి, ధాన్యం నాణ్యతతో ఉండేలా పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల మండలంలోని స్టేట్ వేరోస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోని బఫర్ గోదాంను జిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం గోదామును పరిశీలించి, ధాన్యం నిల్వ వ్యవస్థ పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు కలెక్టర్ సంతోష్. మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉపయోగించి ధాన్యంలో రంగు మార్పు ఉన్నవి గుర్తించి వాటిని నిల్వ చేయకూడదని తెలిపారు.
తేమశాతంను తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. ఓపిఎంఎస్(ఆన్లైన్ ప్యాడీ మానేజ్మెంట్ సిస్టం ) లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. గోదాం నిల్వ విధానం కూడా అన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. జిల్లాలో దాదాపు 40 వేల టన్నుల ధాన్యం గోదాములో నిలువలుగా ఉన్నందున ఇతర జిల్లాలకు వాటిని తరలించనున్నట్లు తెలిపారు. హమాలీలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, టెక్నికల్ ఆఫీసర్ సుబ్బన్న, గోదాం మేనేజర్ నాగరాజు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






