నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాలి : ఆర్. ఎస్. ప్ర‌వీణ్ కుమార్

by Ratna Kumari |

విద్యార్థులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు.

నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాలి : ఆర్. ఎస్. ప్ర‌వీణ్ కుమార్
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : విద్యార్థులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. గ‌ద్వాల పట్ట‌ణంలోని పాత బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న వైఎస్సార్ స‌ర్కిల్ లో సోమ‌వారం బీఆర్ఎస్వీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరు దీక్ష నిర్వ‌హించారు. ఈ దీక్ష‌కు ముఖ్య అతిథిగా ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యాడు. విద్యార్థులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం త‌క్ష‌ణమే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్వ పల్లయ్య, బాసు హనుమంత్ నాయుడు, బీ.ఎస్. కేశవ్, నాగర్ దొడ్డి వెంకట్రాములు పాల్గొన్నారు.

Next Story