క‌డుపు నింపుకునేందుకు కారు ఎక్కిన మేక‌..!

by Ratna Kumari |

దిశ‌, ఆలంపూర్ : సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. మ‌నం త‌రుచూ చూస్తూనే ఉంటాం. అలాంటి వాటిలో కొన్ని చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి.

క‌డుపు నింపుకునేందుకు కారు ఎక్కిన మేక‌..!
X

దిశ‌, ఆలంపూర్ : సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. మ‌నం త‌రుచూ చూస్తూనే ఉంటాం. అలాంటి వాటిలో కొన్ని చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి. కానీ అవి మాత్రం క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కూటి కోసం కోటి తిప్ప‌లు అన్న మాన‌వుడి నానుడి మూగ‌జీవాల‌కు కూడా త‌ప్ప‌డం లేదు. కడుపు నింపుకోవడానికి ఏకంగా ఓ మేక కారు పైకి ఎక్కి చెట్టు కొమ్మలు తింటున్న దృశ్యం అల్లంపూర్ మండల కేంద్రంలోని త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఆవరణలో చోటు చేసుకుంది. త‌హ‌శీల్దార్ కార్యాలయం ఆవరణలో నిలుచున్న‌ కారుపైకి అటు ఇటు నడుచుకుంటూ చెట్టు కొమ్మలను తింటూ కడుపు నింపుకుంది. కారు యజమానులు మాత్రం కాసేపు చూసి ఆ మేకను అటు నుంచి వెళ్ల‌గొట్టారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైర‌ల్ అవుతోంది.

Next Story