- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేపీఎన్సీఈ లో వంద శాతం ఉద్యోగాల కల్పనే లక్ష్యం : కళాశాల చైర్మన్ రవికుమార్
మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో వంద శాతం అడ్మిషన్లు, వంద శాతం ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని జెపిఎన్సీఈ కళాశాల చైర్మెన్ కెఎస్.రవికుమార్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో వంద శాతం అడ్మిషన్లు, వంద శాతం ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని జెపిఎన్సీఈ కళాశాల చైర్మెన్ కెఎస్.రవికుమార్ అన్నారు. గురువారం కళాశాలలో 'తరంగ్' పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడి, వారిలో దాగి ఉన్న కళలను వెలికితీసి ప్రదర్శించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. కళాశాలలో అందుబాటులో ఉన్న 'టిసీఎస్ ఐయాన్, ఐబిఎం ఎన్ఎక్సుటి' శిక్షణ ద్వారా లక్ష్యసాధన సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం తమ కాలేజీలో సీఈసీ పూర్తి చేసి జర్మనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, పరీక్షల నిర్వాహణాధికారి కోటల సందీప్ కుమార్ పాల్గొన్నారు.






