నాణ్య‌మైన విద్య‌తోనే విద్యార్థుల భ‌విష్య‌త్ : ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

by Ratna Kumari |

నాణ్యమైన విద్యతోనే విద్యార్థుల భ‌విష్య‌త్ మారుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు.

నాణ్య‌మైన విద్య‌తోనే విద్యార్థుల భ‌విష్య‌త్ :  ఎమ్మెల్యే  కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
X

దిశ‌, తిమ్మాజీపేట : నాణ్యమైన విద్యతోనే విద్యార్థుల భ‌విష్య‌త్ మారుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ ఇండియన్ ఐకాన్ టాక్ట్‌ఫుల్ ప్రైమరీ స్కూల్ ను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న విద్యా సదుపాయాలు, ఆధునిక తరగతి గదులను మౌలిక వసతులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పట్టణ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఇటువంటి విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.


ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం కూడా అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కలిసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెలికాం శాఖ డైరక్టర్ శ్రీనివాస్ బహదూర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి, మండల అధ్యక్షుడు వివేక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగది మల్లయ్య గౌడ్, లక్ష్మి నారాయణ, దేవస్వామి, చింతకింది లింగం, చిలుక భాస్కర్ రెడ్డి, దాచేపల్లి రామ్మోహన్, మీదింటి సురేందర్, విద్యసంస్థ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story