ఇసుకాసురుల ఇష్టా రాజ్యం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-07 16:09:17  IST  )

కృష్ణ మండలంలోని గురజాల గ్రామం శివారులో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇసుక డంపులను నిల్వ ఉంచడంతో బుధవారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆ డంపులను సీజ్ చేశారు.

ఇసుకాసురుల ఇష్టా రాజ్యం
X

దిశ, కృష్ణ : ఇసుక మాఫీయాది ఇష్టారాజ్యం అయింది. రోజు రోజుకు మాఫియా పెరిగిపోతోంది. త‌వ్వుకున్నోడికి త‌వ్వుకున్నంత‌.. దోచుకున్నోడికి దోచుకున్నంత లా అయింది. కృష్ణ మండలంలోని గురజాల గ్రామం శివారులో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇసుక డంపులను నిల్వ ఉంచడంతో బుధవారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆ డంపులను సీజ్ చేశారు. అంతకుముందు అక్రమ ఇసుక డంపుల గురించి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తహశీల్దార్ ని సంప్రదించగా.. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆ అక్రమ ఇసుక డంపులను తహశీల్దార్ సీజ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. ఈ అక్రమ డంపులు నిల్వ ఉండగా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. త‌హ‌శీల్దార్ కి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలించిన సహించేది లేదని హెచ్చరించారు. సీజ్ చేసిన ఇసుకను వెంటనే వేలం వేసి ప్రభుత్వ పనులకు ఉపయోగించుకోవాలని రెవెన్యూ అధికారులకు మాజీ ఎమ్మెల్యే ఆదేశించారు.

Next Story