- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలిక అదృశ్యం.. అతనే కిడ్నాప్ చేశాడా..?
by Taduka Kalyani |
ఓ బాలిక అదృశ్యమైన సంఘటన జడ్చర్ల మండల పరిధి బూరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది.

X
దిశ, జడ్చర్ల: ఓ బాలిక అదృశ్యమైన సంఘటన జడ్చర్ల మండల పరిధి బూరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలిక (16). తన కూతురు జడ్చర్ల పట్టణంలోని తన మరిది ఇంట్లో ఉండేదని, శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిందని బాలిక తల్లి లక్ష్మి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా మండల పరిధిలోని చిట్టెబోయిన్ పల్లి గ్రామానికి చెందిన రాహుల్ గతంలో తన కూతురిని ప్రేమించమని వేధించేవాడని అతనే శుక్రవారం రాత్రి తన కూతురిని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






