భోజనంలో జెర్రీ రావడం పై డీఈఓ ఆగ్రహం

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి బాలుర పాఠశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించిన అక్షయపాత్ర భోజనంలో జెర్రీ రావడం పట్ల విద్యార్థులు భయాందోళనకు

భోజనంలో జెర్రీ రావడం పై డీఈఓ ఆగ్రహం
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి బాలుర పాఠశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించిన అక్షయపాత్ర భోజనంలో జెర్రీ రావడం పట్ల విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై డీ వైఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ డీఈవో ప్రవీణ్ కుమార్, జడ్చర్ల ఎంఈఓ మంజుల దేవితో కలిసి బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలను సందర్శించి అక్షయపాత్ర భోజనాన్ని పరిశీలించారు. కాంట్రాక్ట‌ర్లు వాటిని పర్యవేక్షిస్తున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జెర్రీ వచ్చిన అన్నం తిన్న విద్యార్థులను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత అధికారులకు వివరించి బాధ్యులపై చర్య తీసుకుంటామని డీఈఓ ప్రవీణ్ కుమార్ అన్నారు.

పాఠశాలకు డీఈ ఓ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల వద్ద కు చేరుకొని జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అక్షయపాత్ర భోజనాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డీఈవో ప్రవీణ్ కు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు అక్షయ పాత్ర భోజనం తినడం వల్ల చాలా అనారోగ్యానికి గురవుతున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అన్నారు. జిల్లాలో కొన్ని రోజుల కింద‌ట‌ గొల్లపల్లి పాఠశాలలో కూడా ఇలాగే పురుగులు వచ్చాయని.. పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని అన్నారు. ఉనికి ఉడ‌క‌ని అన్నంతో నీళ్ల చారుతో విద్యార్థులు తినలేక అవస్థతకు గురవుతున్నారని.. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వనీదే అన్నారు. ప్రభుత్వం స్పందించి అక్షయపాత్ర భోజనాన్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఉండే విధంగా పాఠశాలల్లోనే వండి వండించాలంటూ వారు జిల్లా విద్యాధికారి డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ స్పందించి త్వరలోనే పాఠశాలలో వండే విధంగా ఏర్పాటు చేస్తామని అక్షయ పాత్ర రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ భాను ప్రసాద్ యాదవ్, నాయకులు ప్రవీణ్, జ్ఞానేశ్వర్, నర్సింలు, జాఫర్ పాల్గొన్నారు.

Next Story