- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్నత విద్యావంతురాలు వైష్ణవి మృతి బాధాకరం
The death of highly educated Vaishnavi is sad

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వైష్ణవి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి డా.సీ.లక్ష్మారెడ్డి పరామర్శించారు. వైష్ణవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వైష్ణవి హత్య ఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.తీవ్ర దుఃఖంలో వున్న వైష్ణవి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జడ్చర్ల పట్టణంలో పట్టపగలే యువతిని ప్రేమ ఉన్మాది దారుణంగా హత్య చేయడం హేయమైన చర్యని అన్నారు. ఏదైనా ప్రేమను ప్రేమతో ఇరువురి ఇష్టపూర్వక అంగీకారంతో ముందుకు వెళ్లాలి కానీ ప్రేమ పూల తో ఉన్మాదిలా మారి ఇలా హత్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు పట్టపగలే దారుణ హత్యకు గురైన వైష్ణవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మాజీ మంత్రి కోరారు. మాజీ మంత్రి వెంట జడ్చర్ల పట్టణ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






