అలంపూర్ చౌరస్తాలో హోటల్ లో సీజ్ చేసిన సిలిండర్లు మాయం

by Ratna Kumari |

ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని వివిధ హోటల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా గృహాలకు వినియోగిస్తున్న సిలిండర్లను వ్యాపారులు వినియోగిస్తుండటంతో సివిల్ సప్లై ఎన్ పోస్ట్ మెంట్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు చేసి కేసులు నమోదు చేసిన ఘటన చోటు చేసుకున్నది

అలంపూర్ చౌరస్తాలో హోటల్ లో సీజ్ చేసిన సిలిండర్లు మాయం
X

దిశ, ఉండవెల్లి : ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని వివిధ హోటల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా గృహాలకు వినియోగిస్తున్న సిలిండర్లను వ్యాపారులు వినియోగిస్తుండటంతో సివిల్ సప్లై ఎన్ పోస్ట్ మెంట్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు చేసి కేసులు నమోదు చేసిన ఘటన చోటు చేసుకున్నది. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా లో అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు హోటళ్లపై దాడులు చేసి సిలిండర్లను సీజ్ చేశారు. సాయంత్రానికి టోల్ గెట్ దగ్గర ఉన్న కొన్ని హోటళ్లలో దాడులు చేసి సిలిండర్లు సీజ్ చేసి హోటల్ నిర్వహకులతో కుమ్మక్కై వారిచ్చిన డబ్బులకు ఆశపడి వదిలేసినట్లు ఇతర వ్యాపార దుకాణ యజమానులు ఆరోపణలు చేస్తున్నారు.

ప్రజలు ఇంటికి వినియోగించే సిలిండర్లు వాడుతున్నారని అతిధి హోటల్, హర్ష హోటల్ నుండి 9సిలిండర్లు స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసుకున్నట్టు అధికారులు పేర్కొనడం పలు విమర్శలకు దారి తీస్తున్నది. ఉండవెల్లి మండలం పూల్లూర్ పరిడీజీలో సుమారు 100కు పైగా వ్యాపార దుకాణాలున్నాయి. నిత్యం వ్యాపారులు 985రూపాయలు ఉన్న డొమెస్టేక్ సిలిండర్ ను గ్యాస్ ఏజెన్సీ ద్వారా 1500బ్లాక్ లో తీసుకుంటూ తమ వ్యాపారాలను కొన్నసాగిస్తున్నా మాపై దాడులు చేసి సిలిండర్లు సీజ్ చేస్తున్నారు కానీ బ్లాక్ లో అమ్మిన నిర్వహకులపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. కమర్షియల్ సిలిండర్ లను 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తేనే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లు ఇస్తురన్నారని వ్యాపారులు మండి పడ్డారు.

ప‌ట్టుకున్నారు.. వ‌దిలేశారా..?

44వ జాతీయ రహదారి పుల్లూర్ టోల్ గెట్ సమీపంలో హోటల్స్, అలంపూర్ చౌరస్తా లోని హోటల్స్ పట్టుబడిన సిలిండర్ల ను ఎన్ పోర్న్ మెంట్ అధికారులు సీజ్ చేశారు. హోటల్ నిర్వాహక్కులతో కుమ్మక్కై వదిలేశారు. అవినీతికి పాలుపడి సీజ్ చేసిన సిలిండర్లను వదిలేసిన ఎన్ పోర్స్ మెంట్ నిర్వహకులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story