- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహమ్మదాబాద్ క్లస్టర్ 1 నామినేషన్ల స్క్రూటిని పరిశీలించిన కలెక్టర్
దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ క్లస్టర్ -1లోని మహమ్మదాబాద్, కంచన్‌పల్లి జీ.పీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు దాఖలైన నామినేషన్లు ఈ స్క్రూటినిలో పరిశీలనకు వచ్చాయి. స్క్రూటిని టేబుళ్ల వద్ద జరుగుతున్న ప్రక్రియను కలెక్టర్ వివరంగా పరిశీలిస్తూ అభ్యర్థుల పత్రాలు సక్రమంగా పరిశీలించబడుతున్నాయో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల పరిశీలన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్క్రూటిని నిర్వహించాలని సూచించారు. స్క్రూటినిలో ఎన్నికల అధికారులు, మహమ్మదాబాద్ మండల సిబ్బంది పాల్గొన్నారు.






