నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, హ‌న్వాడ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ క్లస్టర్ లో ఇబ్రహీంబాద్, తిరుమలగిరి, నాయినోని పల్లి, పుల్పోని

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్
X

దిశ‌, హ‌న్వాడ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ క్లస్టర్ లో ఇబ్రహీంబాద్, తిరుమలగిరి, నాయినోని పల్లి, పుల్పోని పల్లి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ ను, హెల్ప్ డెస్క్ ఏర్పాటును కలెక్టర్ విజయెందిర బోయ పరిశీలించారు. అభ్యర్థులకు నామినేషన్ల దాఖలులో సందేహాలు నివృత్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు. హన్వాడ మండలంలో మొదటి రోజు 32మంది సర్పంచ్ అభ్యర్థులు, 34మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

హన్వాడ మండలంలో ఇబ్రహీంబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, తేమ శాతం రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రంలోని రిజిస్టర్‌లను పరిశీలించి, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ట్యాబ్ ఎంట్రీ‌లో తప్పులు దొర్లకుండా చూడాలని, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేయాలని సూచించారు. ధాన్యం కాంట వేసే పద్ధతిని పరిశీలించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,మండల అధికారులు ఉన్నారు.

Next Story