అత్యాచార సంఘటనలో మృతి చెందిన యువతి కుటుంబ సభ్యులను పరమార్శించిన కలెక్టర్

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మూసాపేట మండలం వేముల గ్రామంలో ఈనెల 17 న జరిగిన అత్యాచార సంఘటనలో కొమిరె ప్రవళిక (22)

అత్యాచార సంఘటనలో మృతి చెందిన యువతి కుటుంబ సభ్యులను పరమార్శించిన కలెక్టర్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మూసాపేట మండలం వేముల గ్రామంలో ఈనెల 17 న జరిగిన అత్యాచార సంఘటనలో కొమిరె ప్రవళిక (22) మృతి చెందిందని తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం ప్రవళిక మృతదేహాన్ని సందర్శించి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యువతి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పడంతో పాటు, ఈ ఘటనను అత్యంత హేయమైనదిగా పరిగణిస్తున్నామని, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన నిందితునిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని, త్వరితగతిన శిక్ష పడేలా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం పూర్తిగా అండగా ఉంటుందని ఆమె భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నవీన్, తదితరులు ఉన్నారు.

Next Story