విద్యార్థుల ప్రమాద ఘటన.. ప్ర‌ధానోపాధ్యాయుడు స‌స్పెండ్.. ఎంఈవోకు నోటీసులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతాపూర్ కు పుస్తకాలు తీసుకురావడానికి, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి వెళ్లి ప్రమాదానికి గురైన విద్యార్థుల

విద్యార్థుల ప్రమాద ఘటన.. ప్ర‌ధానోపాధ్యాయుడు స‌స్పెండ్.. ఎంఈవోకు నోటీసులు
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతాపూర్ కు పుస్తకాలు తీసుకురావడానికి, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి వెళ్లి ప్రమాదానికి గురైన విద్యార్థుల ఘటనపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతాపూర్ ప్రధానోపాధ్యాయుడు ఎం శ్రీశైలం సస్పెన్షన్ వేటు వేశారు. పెద్దకొత్తపల్లి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డికి షోకాస్ నోటిస్ జారీ చేశారనీ నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు.

Next Story