'ప్లాస్టిక్ వద్దు.. వస్త్ర సంచులు ముద్దు'

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 1, 2 ల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ప్లాస్టిక్ వద్దు.. వస్త్ర సంచులు ముద్దు
X

దిశ, హన్వాడ : మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 1, 2 ల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులు "ప్లాస్టిక్ వద్దు", "వస్త్ర సంచులు ముద్దు" అనే నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీలు నిర్వహించారు, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, ప్లాస్టిక్ సంచులకు బదులుగా క్లాత్ సంచులను ఉపయోగించమని, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లను వాడకుండా బట్ట సంచులు వంటి వాటిని ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణం కాలుష్యమవుతుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం వి ఎస్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, వైస్ ప్రిన్సిపల్ రవీందర్ రావు, హెచ్ఎం రవుఫ్, పీఈటీ భాను కిరణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు సుభాషిని స్వరూప పాల్గొన్నారు.

Next Story