- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్ ను ఢీ కొట్టిన బైకు.. ఇద్దరు దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గద్వాల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మీనాక్షి లాడ్జి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అతి వేగంగా వచ్చి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన ఇద్దరు వ్యక్తులు గద్వాల పట్టణానికి చెందినవారుగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ముగ్గురూ ఒకే బైక్‌పై ప్రయాణిస్తూ, మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మద్యం మత్తు, అతి వేగమే ఈ ఘోరానికి కారణమని భావిస్తున్నారు. పోలీసుల చర్య ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పరిశీలించి, పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.






