పాన్ గ‌ల్ లో బంద్ విజ‌య‌వంతం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు కేటాయించాల‌ని బీసీ సంఘాలు శ‌నివారం తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పాన్

పాన్ గ‌ల్ లో బంద్ విజ‌య‌వంతం
X

దిశ‌, పాన్ గ‌ల్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు కేటాయించాల‌ని బీసీ సంఘాలు శ‌నివారం తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పాన్ గ‌ల్ మండ‌ల కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు తెలంగాణ బంద్ కి మ‌ద్ద‌తు తెలిపారు. బంద్ లో భాగంగా విద్యా, వ్యాపార సంస్థ‌ల‌ను బంద్ చేయించారు. అనంత‌రం అంబేద్క‌ర్, మ‌హాత్మ‌గాంధీ విగ్ర‌హాల ముందు బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ కేటాయించాల‌ని నినాదాలు చేశారు. అంబేద్క‌ర్ చౌక్ నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. బీఆర్ఎస్ నాయ‌కులు రోడ్డుపై బైటాయించి నిర‌స‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి రవికుమార్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు భగత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీర సాగర్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, సీపీఎం మండల కార్యదర్శి బాల్య నాయక్, పాల్గొన్నారు.

Next Story