- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదండాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన ప్రతి అర్హుడికి పరిహారం అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఉదండాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన ప్రతి అర్హుడికి పరిహారం అందేలా కృషి చేస్తానని, ఎలాంటి ఆందోళన కింద వద్దని ఎమ్మెల్యే అనునూత్ రెడ్డి ఉదండాపూర్ వల్లూరు వాసులకు హామీ ఇచ్చారు.

దిశ, జడ్చర్ల : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఉదండాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన ప్రతి అర్హుడికి పరిహారం అందేలా కృషి చేస్తానని, ఎలాంటి ఆందోళన కింద వద్దని ఎమ్మెల్యే అనునూత్ రెడ్డి ఉదండాపూర్ వల్లూరు వాసులకు హామీ ఇచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్పెషల్ కలెక్టర్ ఆర్డీవోలతో జరిగిన సమీక్ష పెద్ద ఎత్తున వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు పరిహారం పెంచకుంటే తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించాలని అప్పుడే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు అనర్హులైన వారు ఎందరో డబ్బులు పొందారని ఆ అక్రమాలన్నీ త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు రైతులు, ఇండ్లకు అందరికీ పరిహారం ఇప్పించి గ్రామాన్ని పునరవాస ప్రాంతానికి తరలించడమే తన లక్ష్యమన్నారు నియోజకవర్గంలో ఉదండాపూర్ ముంపు గ్రామాల కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాతే ఇతర అభివృద్ధి చేస్తున్నానన్నారు ఇప్పటికీ కొందరు జాబితాలో పేర్లు నమోదు లేవని ఒకసారి ఆర్డర్ పాస్ అయ్యాక మళ్ళీ డబ్బులు వస్తాయో రావో నన్న సందేహం అందరిలో ఉందని అలాంటి ఆందోళన చెంత వద్దన్నారు.
దరఖాస్తు చేస్తే.. 15 రోజుల తర్వాత నిర్వహించే సమీక్ష వరకు జాబితాలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు గ్రామపంచాయతీ జాబితా ఓటర్ కార్డు లాంటివి పరిశీలించి అర్హులందరికీ పరిహారం అందేలా చూస్తానన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏనాడు రైతులకు పరిహారం పెంచమని అడగలేదని ఎప్పుడైనా రైతులు ధర్నాలు చేస్తే అందులో నుంచి కొందరిని పిలిచి లోపల ఇంట్లో మాట్లాడి విరమింప చేసేవారు అన్నారు. తాను రైతుల పక్షాన కొట్లాడి సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నట్లు ప్రకటించారు. చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి పోతున్నామని, తమకు పరిహారం అందలేదని ఆవేదనతో కలుస్తున్నారని ఇంతకుముందే 80 ఏళ్ల వృద్ధురాలు నడవటానికి రాకున్నా తనను కలవడానికి వచ్చిందని అలాంటి వారిని చూసైనా కనికరం కలగలేదా అని ప్రశ్నించారు. చుట్టూ తిరగవద్దని తనకు దరఖాస్తు ఇస్తే అధికారులకు పంపించి ప్రతి 15 రోజులకోమారు సమీక్ష నిర్వహించి ఆ దరఖాస్తు పరిస్థితి ఏమిటో తానే తెలియజేస్తాను అన్నారు. గతంలో జరిగిన అక్రమాలని త్వరలోనే వెలికి తీస్తామన్నారు తాను రాజకీయాల్లోకి పేరు సంపాదించడానికి మాత్రమే వచ్చానని తాను డబ్బులు దండుకోవడానికి ఎమ్మెల్యే కాలేదని తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షపాతి గాని ఉంటానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు.






