- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలిక మృతి కి కారణమైన నిందితుడు అరెస్ట్
మైనర్ బాలిక మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్ అయిన ఘటన నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : మైనర్ బాలిక మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్ అయిన ఘటన నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణపేట సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన ఒక మైనర్ బాలికను పైజల్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మాయమాటలు చెప్పి తనకు అనుకూలంగా ప్రవర్తించాడని, అనంతరం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలిక తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంబంధిత చట్టాల ప్రకారం.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కేసును అత్యంత ప్రాధాన్యంతో విచారించి, నిందితుడు పైజల్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని చెప్పారు. మైనర్లపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ప్రజలు తమ పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు లేదా వేధింపుల విషయాలు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.






