- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BRS vs Congress : తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత
దిశ, రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తుమ్మిళ్లకు పెద్ద ఎత్తున వరద రావడంతో మంగళవారం ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హుటాహుటిన తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో వాదనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. తుమ్మిళ్ల ప్రాజెక్టు ఏర్పాటు కావడానికి కృషి చేసింది నేను. అధికారంలో ఉన్నది మా ప్రభుత్వం మోటార్లను నేను ప్రారంభించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేచే ఎలా ప్రారంభిస్తారు అని సిబ్బందిపై సంపత్ కుమార్ మండిపడినట్లు తెలిసింది. మోటార్ పంపుసెట్లను ఆపివేయడంతో ఎమ్మెల్యే విజయుడు వాటర్ డెలివరీ పాయింట్ల వద్ద బైఠాయించారు. నీటి విడుదల కోసం గత వారం రోజులుగా అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేసాం. ఎమ్మెల్యేగా మోటారు పంపులను ప్రారంభించే అర్హత నాకు ఉంది. ఎలా ఆఫ్ చేస్తారు అని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. నీళ్లను విడుదల చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్యేకు అధికారులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్న సఫలం కావడం లేదు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.