జర్నలిస్టు కుటుంబానికి తెలంగాణ మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమీ కట్టుబడి పని చేస్తోందని టీయూడబ్ల్యూజే (హెచ్ 143) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ తెలిపారు.

జర్నలిస్టు కుటుంబానికి తెలంగాణ మీడియా అకాడమీ ఆర్థిక సహాయం
X

దిశ, అచ్చంపేట రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమీ కట్టుబడి పని చేస్తోందని టీయూడబ్ల్యూజే (హెచ్ 143) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ తెలిపారు. జర్నలిస్టు అమరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో అకాడమీ ముందుంటోందన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ మంజూరు చేసి చెక్కులు అందజేశారు. అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యా మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు కేశవరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లింగాల మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రఘుపతి రాథోడ్ మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తెలంగాణ మీడియా అకాడమీ వారి కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం చెక్కును అందజేసింది. రాథోడ్ గారి భార్య అలివేలుకు చెక్కును మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు అందజేశారు. అదనంగా, ఆమెకు నెలకు రూ.3,000 చొప్పున ఐదేళ్లపాటు పెన్షన్ మంజూరు చేసినట్లు చందు నాయక్ వెల్లడించారు.ఈ సహాయం అందించిన తెలంగాణ మీడియా అకాడమీకి, కృషి చేసిన చందు నాయక్‌కు అలివేలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ అధికారులు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Next Story