వీపనగండ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రారంభం

by velandi.Saikiran |

వీపనగండ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు.

వీపనగండ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రారంభం
X

దిశ, వీపనగండ్ల: గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో మండల కేంద్రమైన వీపనగండ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన శాఖను గ్రామ సర్పంచ్ మీసాల పార్వతమ్మ, బ్యాంక్ రీజినల్ మేనేజర్ సంగీత సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ సంగీత మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు సులభమైన, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించడమే బ్యాంక్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ మీసాల పార్వతమ్మ మాట్లాడుతూ, వీపనగండ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం కావడం మండల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలోఎస్ ఎం ఓ చంద్రశేఖర్, ఎస్ ఎం బి రసాలవిక్రమ్ ,బ్యాంకు మేనేజర్ మదర్ వల్లి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story