- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో మళ్లీ మొదలైన బాక్సైట్ అలజడి
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం గతంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ...

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం గతంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అరకు లోయతో పాటు దాని పరిసర అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా బాక్సైట్ తవ్వకాలకు కుట్రలు జరుగుతున్నాయంటూ గిరిజనులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులను దోచుకుంటూ, తమ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ జరగనివ్వమని హెచ్చరిస్తున్నారు.
అయితే జిల్లా యంత్రాంగం మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని స్పష్టం చేసింది. మైనింగ్‌పై వస్తున్న వార్తలు అవాస్తమని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే స్థానికులు, గిరిజన లీడర్లు మాత్రం మైనింగ్‌పై అనుమానాలున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అరకు ఏజెన్సీ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠత ఏర్పడింది.






