దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

by Ratna Kumari |

దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా జీ.ఓ Ms.No.1, జనవరి 17న‌ 2026 న ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. దివ్యాంగులైన ఇద్దరి మధ్య జరిగే వివాహాలకు రూపాయలు రెండు కక్షల నగదు సహాయం భార్య పేరులో మంజూరు చేయబడుతుందని, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ జనవరి 17న‌ 2026 నుంచి వివాహం చేసుకున్న వారికి వర్తిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన దంపతులు తప్పనిసరిగా www.epass.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తిచేసిన అనంతరం, సంబంధిత సమగ్ర శిశు అభివృద్ధి అధికారి ( ఐసిడిఎస్ ) కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని అవసరమైన ధృవపత్రాలతో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

Next Story