తెలంగాణ సాంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ

by Ratna Kumari |

దిశ, ఎర్ర‌వ‌ల్లి : తెలంగాణ సాంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు పేర్కొన్నారు. బుధవారం ఎర్రవల్లి

తెలంగాణ సాంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ
X

దిశ, ఎర్ర‌వ‌ల్లి : తెలంగాణ సాంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు పేర్కొన్నారు. బుధవారం ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఇటిక్యాల మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మను పండుగ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజేయుడు దుర్గ అమ్మవరికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ‌తుక‌మ్మ‌ను ప్రారంభించారు. మహిళలతో కలిసి కోలాటం బొడ్డెమ్మ ఆటపాటలతో సందడి చేశారు ఎమ్మెల్యే విజేయుడు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ జ‌డ్పీటీసీ హ‌నుమంత రెడ్డి, బాల‌కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మ‌న్ రంగారెడ్డి, ప‌లు గ్రామాల మాజీ స‌ర్పంచ్ లు, నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story