- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ లేక ప్రజలు, విద్యార్థులు అవస్థలు
తెలకపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారు.

దిశ, తెలకపల్లి : తెలకపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారు. జనవరి 31న తెలకపల్లిలో పని చేసిన తహశీల్దార్ జాకీర్ అలీ ఉద్యోగ విరమణ పొందారు. 18 రోజుల నుంచి నూతన తహశీల్దార్ లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పదోతరగతికి చెందిన విద్యార్థులు, డిగ్రీ అయిపోయిన నిరుద్యోగులు క్యాస్ట్, క్రిమిలేయర్ వంటి సర్టిఫికెట్లు వారికి అవసరం ఉన్నాయి. అయితే ఎమ్మార్వో కార్యాలయంలో తహశీల్దార్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే రైతులకు రిజిస్ట్రేషన్ పనులు కూడా కాకపోవడంతో కార్యాలయం చుట్టూ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి నూతన తహశీల్దార్ ని నియమించాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.






