- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులతో పని చేయిస్తున్న ఉపాధ్యాయులు.. అంతలోనే ప్రమాదం..!
దిశ, నాగర్ కర్నూల్ : ఉపాధ్యాయులు చేయాల్సిన పని విద్యార్థులు చేయడంతో ఇద్దరూ విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరూ స్వల్ప గాయాలతో బాధపడతున్నారు

దిశ, నాగర్ కర్నూల్ : ఉపాధ్యాయులు చేయాల్సిన పని విద్యార్థులు చేశారు. అంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బాధపడతున్నారు. ఈ ఘటన పెద్దకొత్త పల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ పాఠశాలలో చదువుతున్న శివ, సాయి, నాని, అశోక్, కార్తీక్ ఐదుగురు విద్యార్థులు. స్కూల్ ప్రధానోపాధ్యాయిని ఆదేశాల మేరకు ఆటో తీసుకొని పెద్ద కొత్తపల్లి వెళ్లి పాఠ్యపుస్తకాలు తీసుకొని తిరిగి సాతాపూర్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరికీ తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే తీవ్ర గాయాలైన విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఒక విద్యార్థికి మాత్రం ఎలాంటివి గాయాలు కాలేదు. ముఖ్యంగా శివ అనే విద్యార్థికి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. స్థానికులు గమనించి 108 సమాచారం ఇవ్వడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీవీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని పిల్లలతో హమాలి పని చేయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






