- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టపాసులు పేలి ముగ్గురు విద్యార్థులకు ప్రమాదం..!
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ రూరల్ మండలం రేగడిగడ్డ తాండా పంచాయతీ పరిధిలోని ప్రైమరీ స్కూల్ లో టపాసులు పేలి ముగ్గురు విద్యార్థులు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ రూరల్ మండలం రేగడిగడ్డ తాండా పంచాయతీ పరిధిలోని ప్రైమరీ స్కూల్ లో టపాసులు పేలి ముగ్గురు విద్యార్థులు గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం 9-30 వరకు కూడా పాఠశాలకు టీచర్లు ఎవ్వరూ రానందున, అంతకు ముందే పాఠశాలకు వచ్చిన రెండవ తరగతి విద్యార్థి సాయి దీపావళి టపాకాయలు కాల్చుదాము రండి అని క్లాసులో ఉన్న తోటి విద్యార్థినిలను స్కూల్ కాంపౌండ్ లోకి తీసుకుని వచ్చి తన వద్ద ఉన్న రెండు వంకాయ బాంబుల ను బయటతీసి ఒకదానికొకటి గట్టిగా రాపిడి చేయగా అవి పెద్దగా పేలాయి. ప్రక్కనే ఉన్న విద్యార్థినిలు రుషిక, వసంత, మానస చేతులు ముఖం కాలిపోయాయి. వెంటనే స్కూల్ స్వీపర్, అక్కడ కొందరు మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న స్కూల్ కు కూడా ఉపాధ్యాయులు సమయానికి రానందునే విద్యార్థులు ఇలా చేయడానికి కారణయ్యారని గ్రామస్తులు ఆరోపించారు.
విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే..
మహబూబ్ నగర్ మండలం రేగడిగడ్డ తాండా ప్రైమరీ స్కూల్ లో టపాసులు కాల్చి, గాయపడి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులను ఈ సాయంత్రం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అనంతరం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరమార్శించారు. చిన్నారులకు నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. జరిగిన సంఘటన పై చిన్నారుల తల్లితండ్రులను అడిగి తెలుసుకుని, పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రతలు పాటించాలని సూచిస్తూ ధైర్యం చెప్పారు.






