మొంథా ఎఫెక్ట్.. జ‌ల‌దిగ్భందంలో మార్లపాడు తండా..!

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు తండా గ్రామం మొoథా తుఫాన్ కారణంగా జలదిగ్బంధలో మునిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వలన లోతట్టు ప్రాంతాలు నీట మునిగి

మొంథా ఎఫెక్ట్.. జ‌ల‌దిగ్భందంలో మార్లపాడు తండా..!
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు తండా గ్రామం మొoథా తుఫాన్ కారణంగా జలదిగ్బంధలో మునిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వలన లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణ ఉపనది డిండి, దుందుభి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అలాగే చంద్రసాగర్ వాగు ప్రమాద స్థాయిలో పారుతున్న నేపథ్యంలో వాగులు పరుగులు పెడుతున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని బాల్మూర్ మండలం గట్టు తుమ్మెను వాగు నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రధాన జాతీయ రహదారి పై ప్రమాద స్థాయిలో పరుగులు పెడుతుండడం చూసినా స్థానికులు గత 40 ఏళ్లలో ఇంత పెద్ద వర్షం కురిసిన సందర్భం లేదని చర్చించుకుంటున్నారు.

జలదిగ్బంధంలో మార్లపాడు తండా..

అచ్చంపేట మండలం పరిధిలోని మార్లపాడు తండా గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయింది. గ్రామస్తులను సురక్షితంగా బయటకు తీసేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్ల లేదు. దుందుభి వాగు మన్నెవారి పల్లి వద్ద ఉదృతంగా ప్రవహిస్తుండడంతో దేవరకొండ- అచ్చంపేట నియోజకవర్గానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటుగా ఎవరు ప్రయాణించవద్దని పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైతే వాగులు వంకలు బాగా పారుతున్నాయో ఆ ప్రదేశాలలో పోలీసులు ముందు జాగ్రత్తగా బారికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.

అయ్యో అంతా నష్టపోతున్నాం..

ఈ భారీ రాకాసి తుఫాను కారణంగా ఉన్న గూడు వదిలి అన్ని సర్వం కోల్పోతూ అటు నివాసాలు ఇటు పంటలు పూర్తిగా నష్టం అవుతుండడంతో అయ్యో అంతా నాశనమైపోతున్నామని మార్లపాడు గ్రామానికి చెందిన రైతులు ప్రజలు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీప ప్రాంతంలో దాదాపు 40 మూగజీవాలు పశువులు ఉండటంతో వాటిని రక్షిస్తామని గ్రామస్తులు కొంత సాహసం చేసినప్పటికీ వాగు వేగంగా పారుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఎనిదిరిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

200 కుటుంబాలను ఒడ్డుకు చేర్చిన అధికారులు

మార్లపాడు తాండ గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో ఉండడంతో వేగంగా స్పందించిన త‌హ‌శీల్దార్ సైదులు, సీఐ నాగరాజు, సిద్ధాపూర్ ఎస్సై పవన్ కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఎవరికి ఎలాంటి హాని జరగకుండా 200 కుటుంబాలను కేశ్య‌ తండా గ్రామానికి చేర్చామని తెలిపారు అధికారులు.

Next Story