జాతీయ గ్రుడ్డు సమన్వయం కమిటీ ఎగ్ కార్డ్ బండ్లు అందజేస్తాం సద్వినియోగం చేసుకోండి : జూపల్లి భాస్కర్ రావు

by Ratna Kumari |

దిశ, చారకొండ : జాతీయ గ్రుడ్డు సమన్వయం కమిటీ ఎగ్ కార్డ్ బండ్లు అందజేస్తాం సద్వినియోగం చేసుకోండి అని టీఎస్ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు.

జాతీయ గ్రుడ్డు సమన్వయం కమిటీ ఎగ్ కార్డ్ బండ్లు అందజేస్తాం సద్వినియోగం చేసుకోండి : జూపల్లి భాస్కర్ రావు
X

దిశ, చారకొండ : జాతీయ గ్రుడ్డు సమన్వయం కమిటీ ఎగ్ కార్డ్ బండ్లు అందజేస్తాం సద్వినియోగం చేసుకోండి అని టీఎస్ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు. చార‌కొండ మండ‌ల ప‌రిధిలో ల‌బ్దిదారుల‌కు ఇవాళ ఎగ్ కార్డు బండ్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ స‌రైన ఉపాధి లేక ఆర్థికంగా వెనుకబడిన లబ్దిధారులకు ఉపాధిని కల్పిస్తూ ఆదుకుంటుంది. ఆర్థికంగా నిలబడటానికి ఉచితంగా అందజేసిన ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని,సమాజంలో సమానత్వ గౌరవం పొందాలని ఆయన లబ్దిదారులకు సూచించారు. అందులో భాగంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల లబ్ది దారులు కట్ట ఆంజనేయులు (తుర్కలపల్లి), ఎండీ.సీరాజ్(జూపల్లి), ఎండీ రషీద్ (గోకారం), రాముని అలివేలు (చారకొండ) లకు సుమారు లక్షా 20వేల విలువ గల ఎగ్ కార్డ్ బండ్లను తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జూపల్లి భాస్కర్ రావు ఉచితంగా అందజేశారు.

Next Story